- సిపిఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి..
వనపర్తి ఆర్టీసీ పాత బస్టాండ్ ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి సి పరమేశ్వర చారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి ఆర్టిసి డిపో అధికారి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పరమేశ్వర చారి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ ను తాత్కాలికంగా వినియోగంలోకి తెచ్చారు కానీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్ కాంపౌండ్ స్థలంలో పూర్తి స్థాయిలో సిసి బెడ్ తోపాటు డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని కోరారు.
వచ్చి పోయే ప్రయాణికులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేసి తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రయాణికులు కూర్చోవడానికి షెడ్డు ఏర్పాటు చేసి కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఆవరణ లోపల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాత బస్టాండ్ ముందు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపే వారికి షట్టర్లతో డబ్బాలు ఏర్పాటు చేసి కిరాయికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ లో లైటింగ్ ఏర్పాటు చేసి బస్టాండ్ స్థలం అన్యాక్రాంతం కాకుండా పాత బస్టాండ్ విస్తరణ ఎంత ఉందో అంత పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గంధం గట్టయ్య, గంధంమదన్, జి బాలస్వామి, రమేష్, నందిమల్ల రాములు బీసన్న తదితరులు పాల్గొన్నారు.
