- పట్టింపు లేని తార్నాక ఫుట్ ఓవర్ బ్రిడ్జి
- పాడైపోయిన లిఫ్ట్ పట్టించుకోని జీహెచ్‌ఎంసీ యంత్రాంగం
- రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వృద్ధులు
హైదరాబాద్ నగరం రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటుగా మహానగరం దిశగా అంచనాలకు మించి అందనంత వేగంతో దేశంలోని నగరాలతో పోటీపడుతూ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ పరుగులు పెడుతుంది.పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిత్యం వివిధ పనులకై రాకపోకలు సాగించే ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన చోట పాదాచార్యులు రోడ్డును దాటేందుకు హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించారు.
స్థానిక ప్రజలు తార్నాక సెంటాన్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా అనేకమంది తార్నాక ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణం కై స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.ఎట్టకేలకు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన జిహెచ్‌ఎంసి అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్వహణ మరిచిపోవడంతో అటు విద్యార్థులు,ఇటు వృద్ధులు,రోడ్డు దాటేందుకు బ్రిడ్జ్ లిఫ్ట్ పనిచేయకపోవడంతో సౌకర్యాలు లేకపోవడంతో ఆసక్తి చూపకపోవడంతో కోట్లు వెచ్చించి నిర్మించిన బ్రిడ్జి ఉత్సవ విగ్రహంల మిగిలిపోయింది.కొంతమంది విద్యార్థులు వృద్ధులు రోడ్డు దాటేందుకు వేరే మార్గం లేక గత్యంతరం లేని పరిస్థితిలో రెండు వైపులా మెట్లు ఎక్కి దిగుతూ తీవ్రమైన ఇబ్బందులకు లోనైతున్నామని అనేకమంది ఆగ్రహాన్ని వెల్లడిస్తుండడం విచారకరం.

ఉదయం సాయంత్రం నరక ప్రయాణం
ఇదిలా ఉండగా సికింద్రాబాద్ తార్నాక పరిసర ప్రాంతాల్లో పెద్దదైన సెంటాన్స్ పాఠశాల లో అనేక మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు.విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాఠశాల నుండి ఇంటికి చేరుకునేందుకు రోడ్డు దాటేందుకు నిర్మించినటువంటి తార్నాక పుట్టవర్ బ్రిడ్జి విద్యార్థులకు పాదాచారులకు ఉపయోగపడక పోగా ఉదయం సాయంత్రం వేళలో సుమారుగా ఒక గంట సేపు నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో రాకపోకలు సాగిస్తున్నటువంటి వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
లిఫ్ట్ పునరుద్ధరణపై పట్టింపులేని అధికారులు
సుమారుగా కోట్ల రూపాయలు వెచ్చించి ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రెండేళ్లయినా కూడా ప్రారంభం నాడు పనిచేసిన లిఫ్ట్ అనంతరం నేటికీ వర్క్ చేయకపోవడంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రోడ్డు దాటి విద్యార్థులు వృద్ధులు విద్యార్థుల సహాయకులు తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తార్నాక సెంటెన్స్ పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు వృద్ధులకు స్థానిక ప్రజలకు తార్నాక సెంటాన్స్ ఫుటోవర్ బ్రిడ్జి లిఫ్ట్ ని పునరుద్ధరించి మెరుగైన సర్వీసును అందించేలా తగిన చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను సిబ్బందిని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

