Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Housewarming | గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యేలు..

Housewarming | గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యేలు..

అడ్డాకుల మండలం పెద్ద మునగాల చెడు గ్రామానికి చెందిన పుష్యమ్మ , వెంకట్ రెడ్డిల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సత్యనారాయణ స్వామి వ్రత తీర్థ ప్రసాదాలను స్వీకరించి దంపతులకు నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో సొంత ఇంటి నిర్మాణం ఓ కలగా ఉంటుందని వారికి నచ్చినట్లుగా ఇంటి నిర్మాణం చేసుకోవడం అభినందించ దగ్గ విషయమని నూతన ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసిన దంపతులకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సత్యరెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News