HomeUncategorizedDevelopment | అజ్జకోలు ను అభివృద్ధి పతంలోకి తెస్తా..

Development | అజ్జకోలు ను అభివృద్ధి పతంలోకి తెస్తా..

  • పదేళ్లలో అభివృద్ధికి ఆమడ దూరం..
  • కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొల్ల శ్రీనివాసులు..

బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, తనను సర్పంచ్ గా గెలిపిస్తే అజ్జకోలు గ్రామాన్ని అభివృద్ధి వైపు మళ్ళిస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొల్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ వేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాయకులు పార్టీలు మారడం తప్ప వారికి గ్రామ అభివృద్ధి పై సోయి లేదని స్పష్టం చేశారు.

Golla Srinivasulu Ajjakollu Development Agenda 1

యువత, గ్రామ ప్రజలందరూ తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తరఫున తనను గెలిపిస్తే గ్రామానికి అత్యధిక నిధులు మంజూరుకు కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ వాకిటి సత్యం, రాజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సాయిబాబా, కురువ నరసింహ, తోకల రవి, మహేందర్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Golla Srinivasulu Ajjakollu Development Agenda 2
- Advertisement -
RELATED ARTICLES

Latest News