డిసెంబర్ 6న సావిత్రి 90వ జయంతి సభ
మహానటి సావిత్రి (Savitri) 90వ జయంతి(Jayanthi) వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించనున్నారు. సావిత్రి మహోత్సవ్ (Savitri Mahotsav) పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రముఖ కళా సంస్థ ‘సంగమం ఫౌండేషన్’(Sangam Foundation)తో కలిసి నిర్వహిస్తున్నట్లు ఆమె కుమార్తె విజయచాముండేశ్వరి (Vijaya Chamundeshwari) తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి.

డిసెంబర్ 6న సావిత్రి 90వ జయంతి సభలో ‘మహానటి’ చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్ (Nagashwin), ప్రియాంకాదత్, స్వప్నాదత్‌లనూ, ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ప్రత్యేకంగా సత్కరించనున్నారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ సభకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ముఖ్య అతిథిగా హాజరవుతారు. చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు.


