Friday, March 6, 2026
Homeఆదిలాబాద్Nirmal District | ‘స్థానికం’లోనూ ఎగరాలి కాంగ్రెస్ జెండా

Nirmal District | ‘స్థానికం’లోనూ ఎగరాలి కాంగ్రెస్ జెండా

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) కాంగ్రెస్ పార్టీ జెండా (Congress Party Flag) ఊరూరా ఎగరాలని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ, ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ మూడు రంగుల జెండా రెపరెపలాడేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టి కృషితో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను (Welfare Schemes) ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.

ఈ మేరకు ఆయన జన్నారం మండల (Jinnaram Mandal) కేంద్రంలో కాంగ్రెస్ నేతలు, సర్పంచ్ ఆశావహులతో సమావేశమయ్యారు. సర్పంచ్ ఎలక్షన్స్‌తోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించారు. మన అభ్యర్థులకు సహకరించుకొని బలమైన అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. గెలుపు గుర్రాలను ప్రోత్సహిస్తామని, గ్రామ స్థాయిలో చర్చలు జరిపాకే ఎలక్షన్ బరిలో నిలవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మద్దదారులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News