- రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి..
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వనపర్తి జిల్లా నూతన డిసిసి అధ్యక్షుడు కొత్త కాపు శివసేనారెడ్డి ధీమ వ్యక్తం చేశారు. బుధవారం బి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎం.బి గార్డెన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తో ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత పదేళ్ల బి.ఆర్.ఎస్ ప్రజా సంక్షేమాన్ని మరిచిందని నేడు ప్రజా పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత ప్రయాణం, రైతు బీమా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని కొనియాడారు.
ప్రభుత్వం అందించే పథకాలే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వనపర్తి డి సి సి అధ్యక్షునిగా నియమించిన అధిష్టాన పెద్దలకు, ఉమ్మడి జిల్లా నాయకులకు మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో డిసిసి బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్ యాదవ్, శంకర్ ప్రసాద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ తిరుపతయ్య, ధనలక్ష్మి, బ్రహ్మం చారి, కోళ్ల వెంకటేష్, సి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
