ఇటీవల కన్నుమూసిన తెలంగాణ ప్రముఖ కవి (Telangana Famous Poet) అందెశ్రీ(Andesri)కి కెనడా(Canada)లోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (Telangana Development Forum) ఘనంగా నివాళులు(Tributes) అర్పించింది. ఈ మేరకు టొరెంటో(Torento)లోని తెలంగాణవాసులు ఆయన సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి (Telangana Movement) అందెశ్రీ ఆత్మలా నిలిచారని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన అందించిన సేవలు అసామాన్యమని కొనియాడారు. అందెశ్రీ పదకొండేళ్ల కిందట కెనడాలో పర్యటించారు. సభలో పాల్గొన్న పలువురు ఆయన పర్యటన వివరాలను ప్రస్తావించారు. అందెశ్రీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రవాస భారతీయులు (NRIs) కోరారు. ఆయన రచనలను డిజిటలీకరించి భవిష్యత్ తరాల కోసం భద్రపరచాలని సూచించారు.
