మాజీ మంత్రికి కవిత తీవ్ర హెచ్చరిక
అతనికి 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ఆరోపణ
నిరంజన్ అవినీతి కేసీఆర్‌కి తెలియదా అని ప్రశ్న
హరీశ్ వల్లే నిరంజన్‌పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని విమర్శ
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చె లేచిపోతుంది అని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని తేల్చిచెప్పారు. జాగృతి జనం బాట(Jagruti Janam Baata) కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తి(wanaparthy)లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డిపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు.
కవిత ఇంకా ఏమన్నారంటే..
ఒక్కసారి మంత్రి అయిన నిరంజన్ రెడ్డి 3 ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టుకున్నారు. అందులో అసైన్డ్ భూములూ ఉన్నాయి. కృష్ణా నది కాలువను సైతం ఆయన ఫామ్‌హౌస్ నుంచే వెళ్లేలా మళ్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అవినీతి వ్యవహారాలు కేసీఆర్‌కు తెలియవా? లేక, హరీశ్ రావు అడ్డుపడి కేసీఆర్(Kcr) దృష్టికి వెళ్లకుండా కాపాడారా?. నిరంజన్ రెడ్డి అవినీతిపై ఇక్కడి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. మీడియా ముఖంగా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళుతున్నా. నిరంజన్ రెడ్డి అవినీతిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?. హరీశ్ రావు(Harish Rao)కు సన్నిహితుడు కావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని కాపాడుతోందని నమ్ముతున్నా. బీఆర్ఎస్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పార్టీలో ఉద్యమకారులు ఉండలేక సతమతమవుతున్నారు.
