తెలంగాణ రాష్ట్రంలోని ముదురాజుల సంక్షేమం కోసం, ముదిరాజు యువత, విద్యార్థి, మత్స్యకారుల, మహిళ ముదిరాజుల భవిత కోసం “పార్టీల జెండా వద్దు ముదిరాజుల ఎజెండా ముద్దు” అనే నినాదంతో ముందుకు వెళుతూ బీసీ-A సాధించడమే లక్ష్యంగా ”జై ముదిరాజ్” ఉద్యమంతో ముందుకు పోవడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం జరిగినది. హైదరాబాద్ టూరిజం ప్లాజా లో బుధవారం జరిగిన రాష్ట్ర ముదిరాజ్ అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు పై నిర్ణయం తీసుకోవడం జరిగినది.

తెలంగాణ ముదిరాజ్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో కోలి సమాజ్ జాతీయ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం ముదిరాజ్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు జగన్మోహన్ ముదిరాజ్, దినకర్ బాబు ముదిరాజ్, సీనియర్ ముదిరాజు నాయకులు ఉప్పరి నారాయణ ముదిరాజ్, గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, సంజీవ ముదిరాజ్, వెంకటేశం ముదిరాజ్, రోహిత్ ముదిరాజ్, డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, నీలకంఠం ముదిరాజ్, DL పాండు ముదిరాజ్, పులి దేవేందర్ ముదిరాజ్, అల్లా దుర్గం సురేష్ ముదిరాజ్, పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగినది.
వ్యక్తిగత ఎజెండాలతో అనేకమంది ముందుకు వచ్చి ముదిరాజ్ జాతి నాయకులు నేడు ఆ పేరుతోనే చలామణి అవుతూ ముదిరాజులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇకముందు వ్యక్తిగత ఎజెండా పక్కనపెట్టి ముదిరాజ్ జాతి ఎజెండాతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కోకాపేటలో ఇచ్చిన ఐదు ఎకరాల స్థలంలో కచ్చితంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం నిర్మించడం జరుగుతుందని, బీసీ-A లో లేనందున అనేక ఇబ్బందులు పాడున్న జాతిని కాపాడాలని పలువురు మాట్లాడుతూ తెలిపారు. నాటి మన పెద్దల విధానాలతోనే ఇప్పటివరకు రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య ముదిరాజులది అధికమని వక్తలు తెలిపారు.

ఉమ్మడి కార్యాచరణతో ముందుకు పోయి బీసీ-A సాధించే వరకు వదిలేది లేదని శపథం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజ్జని రమేష్ ముదిరాజ్, రెడ్డి శ్రీను ముదిరాజ్, డాక్టర్ ప్రతిభా లక్ష్మీ ముదిరాజ్, దీపిక ముదిరాజ్, అల్లుడు జగన్ ముదిరాజ్, మహేష్ ముదిరాజ్, ఉప్పరబొయి రంజిత్ ముదిరాజ్, పుల్ల రాజేశ్వర్ ముదిరాజ్, పుట్ట బాలరాజు ముదిరాజ్, కోట్ల పుష్పలత, అనిల్ కుమార్ ముదిరాజ్ ( స్థల ప్రభావం వలన కొన్ని పేర్లు రాయటం లేదు దయచేసి గమనించగలరు)
జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన విధంగా ముదిరాజుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ ప్రజా ప్రభుత్వం ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ ఏలోకి కూడా త్వరలోనే మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే గత ప్రభుత్వం కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం కోసం ఇచ్చినటువంటి ఐదేకరాల భూమిలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. ముదిరాజ్ యొక్క కష్టాన్ని ముదిరాజుల యొక్క శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే గుర్తించిందని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ముదిరాజులకు సరైన గుర్తింపు లభిస్తుందని చైర్మన్ గారు తెలియజేశారు. కులగనన చేసి సాంకేతికంగా అతిపెద్ద కులం ముదిరాజ్ లేదని సంఖ్యాపరంగా నిరూపించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
