- విచ్చల విడి మందు షాపులపై పోలీసుల కొరడా
- గ్రామాల్లో మద్యం పారితే కఠిన చర్యలే
- సిపి డిసీజన్తో భేష్ అంటున్న జనం
- బెల్ట్ తీయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో జగదేవపూర్ పోలీసుల ప్రచారం
గ్రామాల్లో మద్యం జోరుగా సాగుతుందని తమ దృష్టికి వచ్చిందని ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే పదారిపై కఠిన చర్యలు తీసుకుంటామని . గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై సిపి సీరియస్ గా ఉన్నారని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఉన్న గ్రామాలను బెల్ట్ షాపులు భంగం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు .
సిపి ఆదేశాల మేరకు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ యాజమాన్యులకు రెండు రోజుల గడువు ఇవ్వడం జరిగిందని ఇంకా ఎవరైనా మద్యం విక్రయిస్తే ఈ రెండు రోజులలో విక్రయాలు నిలిపివేయాలని బెల్ట్ షాప్ యాజమాన్యులకు ఆదేశాలు జారీచేశామన్నారు. గడువు దాటిన తర్వాత తనిఖీల్లో భాగంగా ఎవరైనా పట్టుబడితే వారిపై చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. గ్రామాల్లో కొందరు వ్యక్తులు మద్యానికి బానిసై మద్యం మత్తులో జల్సాలు చేస్తూ దొంగతనాలు ,రాబరీలు, వాహనాల దొంగతనాలు చేస్తూ వారి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇలాంటి వి అరికట్టాలంటే గ్రామాల్లో బెల్ట్ షాపులు తీసివేసినపుడే అది సాధ్యమవుతుందని ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వారి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో బెల్ట్ షాప్ లపై నిఘా పెట్టి గ్రామాల్లో జరుగుతున్న దొంగతనాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా గ్రామాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎవరైనా ఇంకా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారు ఎంతటి వారైనా పట్టుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
