Thursday, February 12, 2026
HomeజాతీయంAir Pollution | ఢిల్లీలో ప్రమాదకరంగా గాలి కాలుష్యం

Air Pollution | ఢిల్లీలో ప్రమాదకరంగా గాలి కాలుష్యం

  • రోజురోజుకు మరింతగా క్షీణిస్తునట్లు గుర్తింపు
  • స్పోర్ట్స్ యాక్టివిటీస్పై నిషేధం విధింపు…
  • ప్రజలను హెచ్చరించిన అధికారులు

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గత నెల ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లోని 80 శాతం ఇళ్లలో విషపు గాలి కారణంగా కనీసం ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైనట్లు సర్వేలు చెబుతున్నాయి. గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ లభించటం లేదు.

మాస్కులు, ఎయిర్ ప్యూర్గి+యైర్లు కొంత మేరకు మాత్రమే రక్షణ ఇస్తాయని, కాలుష్యాన్ని నియంత్రించడానికి పాలసీలో మార్పులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్పై నిషేధం విధించింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండటంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని రెండు రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. సాధారణంగా ఢిల్లీలోని స్కూల్స్ చలికాలంలో స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. కాలుష్యం పెరగటంతో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దని ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది. ఇకపోతే ఢిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యతలు నమోద్యాయి. దీంతో ఆ గాలి ప్రాణాంతకంగా మారుతుందని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో 80 శాతం నివాసితులు గాలి నాణ్యతలు క్షీణించడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు.

కనీసం కుటుంబంలో ఒక్కరైనా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. మాస్క్లు, ఎయిర్ ప్యూరిఫైర్లు కొంత రక్షిస్తున్నప్పటికీ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది పొడవునా కచ్చితమైన విధాన మార్పు అవసరమని వైద్యులు సూచించారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఎక్యూఐ 370 స్థాయి వద్ద నమోదైంది. దీంతో వీటి స్థాయిల్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెరీపూర్ కేటగిరీలో వర్గీకరించింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ తీవ్ర స్థాయిలో నమోదైంది. చాందినీ చౌక్, ఆనంద్ విహార్, ముండ్కా, బవానా, నరేలా, డిటియు-వజీర్పూర్లలో 400కి పైగా ఎక్యూఐ నమోదైంది. 18 పర్యవేక్షణా కేంద్రాల్లో 400 పైగానే ఎక్యూఐ నమోదైంది.

గత కొన్ని రోజుల్లోనే కాకుండా.. వచ్చే వారంలో ఆరు రోజులు కూడా తీవ్ర ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యే అవకాశం ఉందని భూశాస్త్రాల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. గాలి కదలికలు సరిగ్గా లేకపోవడం, శీతాకాలం కారణంగా గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలో గాలి ఎంత కాలుష్యంగా ఉందో నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలే నిదర్శనం. దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ప్రధాన కారణం అవుతోంది. ఢిల్లీ చుట్టు పక్కల ఉండే రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉన్నారు. దాని కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. అధికారులు పోలీస్ కేసులు నమోదు. చేస్తున్నా.. భారీ+న్లు వేస్తున్నా కూడా రైతులు మారటం లేదు. పంట వ్యర్ధాలను కాలుస్తూనే ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News