Thursday, February 12, 2026
Homeనల్లగొండgift deed Cancelled | కొడుక్కి ఇచ్చిన 18 ఎకరాల గిఫ్ట్ డీడ్ రద్దు

gift deed Cancelled | కొడుక్కి ఇచ్చిన 18 ఎకరాల గిఫ్ట్ డీడ్ రద్దు

పేరెంట్స్‌ని పట్టించుకోని ఫలితం
యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు నిర్ణయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ (Senior Citizen) కందాడి జనార్దన్ రెడ్డి(80) గతేడాది తన కుమారుడు(Son)కి 18 ఎకరాల 16 గుంటల భూమి(Land)ని గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. కానీ.. తనని చూడట్లేదని, బాగోగులు పట్టించుకోవట్లేదని అతను మెయింటనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్/సీనియర్ సిటిజన్ యాక్ట్-2007 సెక్షన్ 23 ప్రకారం జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు (Complaint) చేశాడు. గిఫ్ట్ డీడీని రద్దు చేయాలని కోరాడు. దీంతో.. వాదోపవాదనలు విన్న తర్వాత సీనియర్ సిటిజన్స్ అయిన తల్లిదండ్రులను చూసుకోవట్లేదని నిర్ధారణ (Confirm) అయింది. ఈ నేపథ్యంలో 18 ఎకరాల 16 గుంటల భూమి గిఫ్ట్ సీడ్ రద్దు చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యత అని, అది విస్మరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News