- ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న పేద దంపతులు
హాయిగా సాగిపోతున్న దంపతుల దాంపత్య జీవితాన్ని రోడ్ ప్రమాదం అంధకారంలోకి నెట్టి వేసింది.సరదాగా కలసి వస్తూ కాసేపట్లో ఇంటికి చేరుకుంటాం అనే లోపే ఊహించని రోడ్ ప్రమాదం వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.కూసుమంచి మండల కేంద్రానికి చెందిన ఇనుగుర్తి వీరేంద్రచారి పెయింటర్ గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఇటీవల ఓ పని నిమిత్తం భార్యతో కలిసి ద్విచక్ర వాహనం పై గుంటూరు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా రోడ్ ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో భార్య,భర్తలు ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.
వీరేంద్రచారి కుడి చేతి నరాలు తెగి,చర్మం కోల్పోయి ఎముకలు కనబడుతున్నాయి.పరిస్థితి విషమించడంతో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది.రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబం కావడంతో దీనంగా ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దాతలు ఎవరైనా దయ తలచి ఆర్థిక సాయం చేస్తే దంపతులకి మెరుగైన వైద్యం అందించవచ్చని కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆర్థిక సాయం చేయాల్సిన వారు తన సోదరుడు నాగచారి చరవాణి సంఖ్య 9705345383 కి ఫోన్ పే చేయాలని వేడుకుంటున్నారు.
