Thursday, February 26, 2026
Homeమెదక్‌Farmers | కలెక్టర్ గారు మా పై దయ చూపండి

Farmers | కలెక్టర్ గారు మా పై దయ చూపండి

  • తిప్పారం రైతుల వేడుకోలు..
  • తిప్పారం రైతుల కన్నీళ్ల మీద రైస్ మిల్లర్ దౌర్జన్యం..!
  • సిద్దిపేట జిల్లాలో రైస్ మిల్లర్స్ సిండికేట్..?
  • అవినీతి మిల్లర్ల హవా ఒప్పందం ఒకటి అమలు మరోటి..!
  • రైతుల్ని దోపిడీ చేస్తున్న రామాంజనేయ రైస్ మిల్..!
  • రెండు రోజులు గా లారీ నీ అన్లోడ్ చెయ్యని రైస్ మిల్లర్..
  • ఇంకో కీల కట్ చేయండి లేదంటే వెళ్లండి..!
  • బస్తా కి 42 కిలోల 300 గ్రాములు తేవాలని ఒప్పందం..!
  • మిల్లుకు చేరాక అదనంగా మరొక్క కిల కట్ అని డిమాండ్..?
  • రైతుల పై బలవంతపు దోపిడీ..!
  • రైతుల కష్టం… రైస్ మిల్లర్ల లాభం..?
  • ప్రభుత్వాన్ని సవాలు చేస్తోన్న సిండికేట్ దోపిడీ..!
  • డబ్బు పిండడానికి రైతులను రోడ్డు మీద పడేసిన రైస్ మిల్లర్..!
  • వడ్లు ఆరబెట్టడానికి కళ్ళలూ లేవు
  • జల్లి పట్టడానికి కరెంటూ లేదు..!
  • ఇప్పటికే 4 కిలోమీటర్ల మేర రోడ్డుపైనే వడ్లు..?
  • ఇంకా ఇప్పటికీ సగానికి పైగా వరి కోతలు జరగలేదు..
  • ఈ పరిస్థితి ఇలానే ఉంటే రైతులు వరి కోతలు కోసే పరిస్థితి లేదు..
  • ప్రతీ బస్తా పండించడానికి రైతు కష్టం ఒక్క కట్‌తో మిల్లర్‌కు దోపిడీ లాభం..
  • 782 బస్తాల వడ్లు… మిల్లర్ కటింగ్ కత్తెర… రైతుల కన్నీటి గాధ..!
  • రైతుల పంటను బందీగా పెట్టి బలవంతపు కట్
  • రైస్ మిల్లర్‌ల హింసకు హద్దు అదుపు లేదా..?

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం తిప్పారం గ్రామంలో రైతులు రాత్రింబవళ్లు శ్రమించి పండించిన వడ్లపై ఇప్పుడు రైస్ మిల్లర్ల దోపిడీ శృతి మించిపోయింది. వడ్ల కొనుగోలులో జాప్యం, మిల్లర్ల అన్యాయం కలిసి రైతులను నరకయాతనలోకి నెట్టేశాయి. కళ్ళలు లేవు కరెంటు లేదు రోడ్డు మీదే వడ్లు ఆరబెట్టిన రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నప్పటికీ తిప్పారం రైతులు వర్షం భయంతో రోడ్డు మీదే వడ్లను ఆరబెట్టాల్సిన పరిస్థితి.

జల్లిపట్టడానికి కరెంటు సదుపాయం లేక రైతులు మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా నిరాశతో వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రైస్ మిల్లర్ తో ఒప్పందం చేసుకున్నప్పటికీ మిల్లులో చేరిన తర్వాత షరతులు మరోలా విధించడంతో జిల్లాలో ఏ మిల్లుకు వెళ్లిన అదే పరిస్థితి ఏర్పడింది
తిప్పారం గ్రామ రైతులు వర్గల్ మండల కేంద్రం లోని శ్రీ రామాంజనేయ రైస్ మిల్లర్ తో ఒప్పందం చేసుకున్నారు జల్లి పట్టకుండా “ఒక్క సంచికి 42 కీళ్లలో 300 గ్రాములు తెస్తే సరిపోతుందని చెప్పి.
తీరా లారీ మిల్లుకు చేరిన వెంటనే వారి దోపిడీ రూపం బయటపడింది.

- Advertisement -

మిల్లర్ యాజమాన్యం రైతులకు షాకింగ్:

“ఇంకో కీల కట్ చేస్తేనే అన్లోడ్ చేస్తాం! అదీ కాదు అంటే లారీ తీసుకెళ్లండి మీరు ఎక్కడికి తీసుకెళ్లినా ఇంకో కిలో అదనంగానే యు కట్ చేస్తారు ఏం చేస్తారో చేసుకోండి తెగేసి చెప్పిన రైస్ మిల్లర్.
దీనితో రైతులు రెండు రోజుల పాటు మిల్లుల గేటు వద్ద బిక్కుబిక్కుమంటు చిక్కుకుపోయిన కడుపు దిగనింపుకున్న కోపంతో అక్కడే ఉన్నారు. రెండు రోజులు గా మిల్లులో లారీ అన్లోడ్ కాకపోవడంతో వడ్లు చెడిపోతాయనే భయంతో రైతులు రోజంతా ప్రాధేయపడ్డ రైతులు. కానీ మిల్లర్ యాజమాన్యం మాత్రం చల్లగా “మా మాటే ఫైనల్… 50 బస్తాలు కటింగ్ చెయ్యకపోతే బస్తాలు దిగవు, అంటూ రైతుల్ని మానసికంగా హింసించడంతో.

చివరికి కన్నీటితో రాజీపడి 782 బస్తాలలో 50 బస్తాలు కట్ చేయడానికి ఒప్పుకొని
దీనిపై మరో దారి లేక మంగళవారం సాయంత్రం రైతులు కన్నీరు పెట్టుకుంటూ ఒప్పుకున్నారు.
782 బస్తాలకుగాను 50 బస్తాలు మిల్లర్ కట్ తీసుకోవడం అంగీకరించక తప్పలేదు. ట్రక్కుషిట్ కూడా మార్చి రాసి ఇవ్వాలని డిమాండ్ చేసిన రైస్ మిల్లర్ దీంతో చేసేదేమీ లేక రైస్ మిల్లర్ డిమాండ్లకు ఒప్పుకొని బిక్కు బిక్కు మంటూ ఇంటి దారి పట్టిన రైతులు.
ఇది రైతులకు ఆర్థికంగా భారీ నష్టం.
నింపిన బస్తాలు తీయక , వడ్లు ఎండినా కూడా, కరెంటు సౌకర్యం లేక, జల్లిపట్టే వీలు లేక వ్యవసాయం చేసే రైతులను చిన్న చూపు చూస్తున్న రైస్ మిల్లర్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న రైతులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News