కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నగర నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లోని శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
- Advertisement -
