Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్Dhanush | ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం అభినందనలు

Dhanush | ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం అభినందనలు

జపాన్‌(Japan)లో జరుగుతున్న డెఫ్లింపిక్స్ (Deaflympics) (బధిర) స్పోర్ట్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం (Gold Medal) సాధించి దేశ కీర్తిని చాటిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌(Dhanush Srikanth)కు సీఎం రేవంత్ (CM Revanth) అభినందనలు తెలిపారు. సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని ధనుష్ నిరూపించి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. స్వర్ణ పతకం సాధించడమే కాకుండా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు(World Record)ను సృష్టించిన ధనుష్ శ్రీకాంత్.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించాలని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News