మృతుల కుటుంబాలకు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
సౌదీ అరేబియా బస్సు ప్రమాదం(Bus Accident)లో మరణించినవారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) పరిహారం (Compensation) ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ (CM Revanth) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ (Cabinet) సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్(Azharuddin), ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటు మైనార్టీ విభాగం ఉన్నతాధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లుచేయాలని నిర్ణయించారు. అంతకుముందు.. ఈ ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
