కవితపై నల్గొండ జడ్పీ మాజీ ఛైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఫైర్
హరీష్‌రావుపై వ్యాఖ్యలు సరికాదంటూ అభ్యంతరం
రేవంత్‌రెడ్డి కోవర్టు కవితేనని వెల్లడి
నల్గొండ, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) తీరుపై నల్గొండ జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ (Former Chairman of Nalgonda Zilla Parishad) బండ నరేందర్ రెడ్డి (Banda Narender Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి హరీష్‌రావు(Harish Rao)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కవిత తన నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కవితకు హరీష్‌రావును విమర్శించే స్థాయి, అర్హత లేదని స్పష్టం చేశారు. హరీష్‌రావు నిఖార్సయిన ఉద్యమకారుడు. 2001 నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీ కోసం, ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన క్యారెక్టర్‌పై సర్టిఫికెట్ ఇచ్చే అర్హత కవితకు లేదు. హరీష్‌రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత విదేశాల్లో ఉన్నారని చెప్పారు. కేటీఆర్(KTR), హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిపై కవిత పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.
ఇకపైనా ఇలాగే వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామన్నారు. కుట్రలు పన్ని హరీష్‌రావును ఒంటరి చేయాలని కవిత దురాలోచన చేస్తున్నారని, ఆయనకు అవినీతి మరక అంటించి, బీఆర్ఎస్ పార్టీ(Brs Party)ని చీల్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హరీష్‌రావును పార్టీ నుంచి బయటికి పంపే విధంగా ఆమె టార్గెట్ చేస్తున్నారని ఆగ్రం వెలిబుచ్చారు.
