HomeఫోటోలుYadadri | భక్తులతో కిటకిటలాడిన ఆలయం

Yadadri | భక్తులతో కిటకిటలాడిన ఆలయం

యాదగిరిగుట్ట, నవంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం (Sri laxmi Narasimha Swami Temple) ఆదివారం భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. కార్తీక మాసం (Kartheeka Maasam) చివరి వారం కావడంతో యాదగిరికొండకు భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివచ్చారు. యాదాద్రి కొండ మీద ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడింది.

WhatsApp Image 2025 11 16 at 13.54.27

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు (Officers) ప్రత్యేక ఏర్పాట్లు (Special Arrangements) చేశారు. ప్రసాదాల కౌంటర్లలో, ధర్మ దర్శనం క్యూలైన్లలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో, నిత్య కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News