కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అసిస్టెంట్ కోచ్(Assistant Coach)గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ (Former Aussie all-rounder) షేన్ వాట్సన్ నియమితుడయ్యాడు. ఐపీఎల్(IPL) 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్(KKR) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. వాట్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. మొత్తమ్మీద 20 వేల రన్నులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 280 కన్నా ఎక్కువ వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన టీమ్‌లలో సభ్యుడు. ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతని సొంతం. రిటైర్ అనంతరం టీ20 లీగ్‌లలో కోచ్, మెంటార్‌గా వ్యవహరించాడు.
- Advertisement -
