కరీంనగర్, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలని, పాల్గొనేలా ప్రోత్సహించాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత (Head of Alphores Educational Institutions) డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో (E-Techno School) నిర్వహించిన ‘ఖేల్ ఉత్సవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇష్టమైన క్రీడల్లో (Sports and Games) శిక్షణ ఇప్పించడం ద్వారా నైపుణ్యం (Skills) పెంచాలని సూచించారు. తమ పాఠశాల విద్యార్థులకు నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయుల(PETs)తో శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ(Talent)ను వెలికితీస్తున్నామని తెలిపారు. వార్షిక ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బాలల దినోత్సవం (Childrens Day) సందర్భంగా బహుమతులు (Prizes) ప్రదానం చేస్తామని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, త్రో బాల్, నెట్‌బాల్, ఖోఖో, కబడ్డి, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
