Thursday, February 12, 2026
HomeజాతీయంEncounter | చ్చత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్

Encounter | చ్చత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్

  • ఎదురు కాల్పుల్లో 6గురు మావోయిస్టులు మృతి
  • ఘటనా స్థలిలో భారీగా ఆయుధసామగ్రిని స్వాధీనం చేసుకున్నా భద్రతా బలగాలు

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధసామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్, దంతెవాడ, డీఆర్, ఎస్ఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు ఇన్సాస్, స్టెల్గన్లు, 303 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నట్లు తెలిసిందని, అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గరియాబంద్ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News