Monday, December 8, 2025
EPAPER
Homeఖమ్మంDoctorate | సురేందర్ రెడ్డికి KU డాక్టరేట్

Doctorate | సురేందర్ రెడ్డికి KU డాక్టరేట్

పాలేరు(ఆదాబ్ హైదరాబాద్): కూసుమంచి (Kusumanchi) మండల కేంద్రానికి చెందిన గుండా సురేందర్ రెడ్డి(Gunda Surender Reddy)కి కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University-KU) వృక్షశాస్త్రం(Botany)లో డాక్టరేట్ ప్రకటించింది. ఆయన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎథ్నో మెడిసినల్ ప్లాంట్లపై ఇన్నివో, ఇన్విట్రో అనే అంశంపై పరిశోధనాత్మక గ్రంథాన్ని (Research paper) సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ ప్రదానం చేసింది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College)లో వృక్ష శాస్త్ర ఆధ్యాపకుడి(Reader)గా పనిచేస్తున్నారు. సురేందర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్య కూసుమంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని నిరూపించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే ఇది సాధ్యమేనని తెలిపారు. డాక్టరేట్ రావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News