Wednesday, March 4, 2026
Homeతెలంగాణఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం

ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం

ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం(Koti Deepotsavam) మహోత్సవంగా జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కార్తిక మాస కోటి దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఆయన 2012 నుంచి ఈ ఉత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా నరేంద్ర చౌదరి కి అభినందనలు తెలిపారు. భక్తి టీవీ ద్వారా 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నేను కూడా ప్రతిరోజూ ఉదయం లేవగానే భక్తి టీవీ లో వచ్చే భక్తి గీతాలు వింటూ, కార్యక్రమాలు చూస్తుంటాన‌ని తెలిపారు. సిద్దిపేటలో కొమురవెల్లి మల్లన్న కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది. కొమురవెల్లి మల్లన్న ఆశీర్వాదం అందరి మీద ఉండాల‌ని భక్తి పూర్వకంగా ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News