Saturday, February 28, 2026
HomeజాతీయంBlast | ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు..

Blast | ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు..

  • ఈ ఘటనలో 10 మంది మృతి, 24 మందికి గాయాలు
  • చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన దుర్ఘటన
  • ఉగ్రవాద నిరోధక దళం, స్పెషల్ సెల్ దర్యాప్తు ప్రారంభం
  • కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
  • మార్కెట్లకు సెలవు కావడంతో తగ్గిన ప్రమాద తీవ్రత
  • భారీగా పేలుడు పదార్థాలు దొరికిన రోజే ఈ ఘటన

హైదరాబాద్లో హై అలర్ట్ అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.

- Advertisement -

పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సోమవారం సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు, ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి.

ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కనే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రతీ సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ పేలుడు జరిగినప్పుడు నేను గురుద్వారా వద్ద ఉన్నాను. భారీ శబ్దం వినిపించింది. అదేంటో మాకు అర్ధంకాలేదు. అంత పెద్దగా వినిపించింది. ఆ వాహనానికి సమీపంలో ఉన్న మరికొన్ని వాహనాలూ పూర్తిగా దగ్ధమయ్యాయఅని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News