Homeకరీంనగర్Vigilance | ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్‌లో విస్తృత తనిఖీలు

Vigilance | ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్‌లో విస్తృత తనిఖీలు

  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కరీంనగర్, నవంబర్ 10: ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్, కార్గో పార్సెల్ కేంద్రం, వాహన తనిఖీలు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

karimnagar police vigilance delhi blast security alert 1

ఈ తనిఖీల్లో బాంబు స్క్వాడ్ మరియు పోలీస్ జాగిలాల (police dogs) బృందాలు పాల్గొంటున్నాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) తెలిపారు. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే, తక్షణమే డయల్ 100 కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670744 కు సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలను కోరారు. ప్రజలు భద్రతా చర్యలకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News