భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో వేడుకలు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ
తెలంగాణ రక్షణ సమితి (డెమొక్రటిక్) పార్టీ ((Telangana Rakshana Samithi(Democratic)) Party ఆవిర్భావ దినోత్సవం (Foundation Day Celebration) ఘనంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (State President) నరాల సత్యనారాయణ (Narala Sathyanarayana) ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూణేమ్ సీతక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. TRS(D) పార్టీ పేదల సంక్షేమం కోసం, తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అనేక కష్టనష్టాల మధ్య ఏర్పడిందని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం, బహుజన వాదాన్ని బలపరచడానికి ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్(డి) అని తెలిపారు. రైతుల, మహిళల సంక్షేమం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
కార్మికుల, కర్షకుల శ్రేయస్సు, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య రక్షణ, గృహ కల్పన, అమ్మ దీవెన, జయశంకర్ క్యాంటీన్, పోడు భూములకు శాశ్వత పరిష్కారం, నీటి పారుదల ప్రాజెక్టులకు శాశ్వత పరిష్కారం, మహిళా సంక్షేమం, మహిళా సంఘాలు, పెళ్లి కానుక, ఉచిత రేషన్ కార్డ్ స్కీమ్స్, ప్రమాద బీమా, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు రూ.6 వేల పెన్షన్, నిరుద్యోగులకు 4 వేల భృతి, మహిళలకు ప్రతి నెలా రూ.3500, ఉచిత కరెంట్, ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ.15 వేలు, ఫ్రీ బస్ ఎక్స్‌ప్రెస్‌లకే కాకుండా అన్ని బస్సులకు, రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ, రైతుబంధు ఎకరాకు రూ.20 వేలు వంటి అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందివ్వడానికి ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్(డి).
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మరి బాలరాజు, పాల్వంచ మండల అధ్యక్షుడు మర్మం కృష్ణ, పాల్వంచ మండల మహిళ అధ్యక్షురాలు మర్మం పార్వతి, భద్రాచలం మండల మహిళా అధ్యక్షురాలు భూక్యా హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమరం సత్యవతి, దుమ్ముగూడెం మండల అధ్యక్షురాలు తుష్టి లక్ష్మి, మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు భూక్యా కుమారి, కొత్తగూడెం మండల యువజన విభాగం అధ్యక్షుడు దుర్గాప్రసాద్.
