ప్రత్యేక దర్శనానికి 2 గంటలు
ధర్మ దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట దేవస్థానం, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి (Laxminarasimha Swami) వారి దేవస్థానం(Temple)లో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు (Sunday Holiday), కార్తీకమాసం (Kartheeka Masam) సందర్భంగా భక్తులు పోటెత్తడంతో జనసంద్రంగా మారింది. కొండ పైన ఎక్కడ చూసినా భక్తులు, పిల్లా పాపలతో కనిపించారు. ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 2 గంటలు, ధర్మ దర్శనానికి (Dharma Darshan) 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

నిత్య కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసాదాల క్యూలైన్లలో, ధర్మ దర్శనం క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయమైన శివాలయాన్ని కూడా భక్తులు దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
