Thursday, March 5, 2026
Homeనల్లగొండCorruption | యాదాద్రిగుట్టపై అవినీతిని అరికట్టండి

Corruption | యాదాద్రిగుట్టపై అవినీతిని అరికట్టండి

ఈవోకు బీజేపీ నేతల వినతిపత్రం

యాదగిరిగుట్ట దేవస్థానం, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి (Lakshminarasimha Swami) వారి దేవస్థానం(Temple)లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు (Bjp leaders) విజ్ఞప్తి చేశారు. అక్కడ నెలకొన్న పలు సమస్యల(Problems)ను పరిష్కరించాలని కోరుతూ ఆలయ ఈవో (EO) వెంకట్రావుకు వినతిపత్రం (Request) ఇచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ.. దేవాలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియలను, అవకతవకలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిష్టను దిగజార్చొద్దని హెచ్చరించారు. డిఇఓ, ఏఈఓ స్థాయి అధికారులు, అర్చకులు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా నిబంధనలను గాలికి వదిలేసి ప్రచారం పేరుతో నెలల తరబడి విదేశాల్లో ఉండటాన్ని తీవ్రంగా ఖండించారు.

స్వామివారి శక్తి సన్నగిల్లకుండా నిత్యం కైంకర్యాల్లో నిమగ్నమై ఉండే ఆలయ అర్చకులు.. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా విదేశాలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. కైంకర్యాల టికెట్లను బ్లాక్‌లో అమ్మే పరిస్థితికి దేవస్థానం సిబ్బంది దిగజారారని, పర్యవేక్షణ లేకపోవడం వల్లే అవినీతికి హద్దు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పీఆర్వో వ్యవస్థలోని వ్యక్తులు స్వామివారి ప్రతిష్టను దిగజార్చేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల దేవస్థాన ఉద్యోగి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, అధికారి లంచంతో పట్టుబడటం దేవస్థాన అధికారుల అవినీతికి నిదర్శనమని అన్నారు.

వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ యాదాద్రి దేవస్థానంపైన వస్తున్న ఆరోపణలపై, జరుగుతున్న అవినీతిపై స్పందించాలని కోరారు. వీటన్నింటికీ త్వరలోనే ముగింపు పలుకుతామని ఎవరికీ భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్, పలుగుల సురేష్, దొమ్మాట ప్రభాకర్, ఆవుల సత్యనారాయణ, సీనియర్ నాయకులు తాళ్ల భాస్కర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, బోడ బుచ్చిబాబు, విజయ్, శ్రీశైలం, మెరుగు శ్రీకాంత్, దేవ, కర్రె శ్యాం, ప్రవీణ్, ప్రశాంత్, శరత్ రెడ్డి, బొమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News