కాంగ్రెస్‌ను ఆదరించాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అజెండా (Agenda) అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో లబ్ది పొందేందుకే బీఆర్ఎస్(Brs), బీజేపీ(Bjp).. కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా శనివారం శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలోని పలు కాలనీల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పాలనలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డా.రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
