Homeవరంగల్‌Kadiyam | ‘మల్లన్నగండి’లోకి చేప పిల్లల విడుదల

Kadiyam | ‘మల్లన్నగండి’లోకి చేప పిల్లల విడుదల

ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా కార్యక్రమం

మత్స్య శాఖ ఆధ్వర్యంలో వంద శాతం సబ్సిడీతో అందిస్తున్న చేప (Fish) పిల్లలను స్టేషన్ ఘనపూర్ (StationGhanpur) నియోజకవర్గం చిల్పూర్ మండలం మల్లన్నగండి రిజర్వాయర్‌(Mallannagandi Reservoir)లోకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Mla Kadiyam Srihari) శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ (Mudiraj) సమాజాన్ని ఆర్థికంగా బలపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందుకే రిజర్వాయర్లలోకి ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టామని తెలిపారు.

- Advertisement -
578271182 1398825735135342 2550519564750175287 n

రాజకీయాలు (Politics) పక్కనబెట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉపాధిని సృష్టించుకోవాలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మత్స్య సంపదలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ ఏరియాలో 320 చెరువులు, 7 రిజర్వాయర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ రిజర్వాయర్‌కు రూ.32.60 కోట్లతో డబుల్ లేన్ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్నాయని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News