Homeమహబూబ్‌నగర్‌Kuchakulla Rajesh Reddy | నాణ్యమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం

Kuchakulla Rajesh Reddy | నాణ్యమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే (Nagarkurnool MLA) డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చెప్పారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం (Heavy Rain) కారణంగా నాగర్ కర్నూల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను (Public Problems) త్వరితగతిన పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి(MLC Damodar Reddy), మునిసిపల్ ఉన్నతాధికారులతో (Officers) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు(Mla Camp Office)లో సమీక్షా సమావేశం (Review Meeting) నిర్వహించారు.

573889481 17951596032018737 4905396228509809667 n

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడెక్కడ వర్షపు నీరు కాలనీల్లోకి చేరిందో గుర్తించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి అందుబాటులో ఉండి త్వరితగతిన స్పందించి నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకొని అవసరమైన చోట శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టాలని సూచించారు. పట్టణ ప్రజలకు ఇకముందు ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News