Friday, March 6, 2026
Homeహైదరాబాద్‌Borabanda | బోరబండలో టెన్షన్.. టెన్షన్..

Borabanda | బోరబండలో టెన్షన్.. టెన్షన్..

మజ్లిస్ సంగతేందో.. పోలీసుల సంగతేందో తేల్చుకుందాం..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్

- Advertisement -

హైదరాబాద్‌(Hyderabad)లోని బోరబండలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఏర్పాటుచేసిన సమావేశానికి పోలీసులు (Police) అనుమతి నిరాకరించటంతో ఉద్రిక్త వాతావరణం (Tension) నెలకొంది. ఎన్నికల సంఘం (Election Commission) అనుమతి ఇచ్చినా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవటంతో బీజేపీ (Bjp) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేంటని నిలదీస్తోంది. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? అని ప్రశ్నించింది.

పోలీసులు ఎంఐఎం (AIMIM) పార్టీకి తొత్తులుగా మారారా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. బోరబండలో బీజేపీ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించింది. బీజేపీ శ్రేణులారా బోరబండకు భారీగా తరలిరండి అని పిలుపునిచ్చింది. మజ్లిస్ సంగతేందో, పోలీసుల సంగతేందో తేల్చుకుందామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు పోటాపోటీగా జరుగుతుండటంతో బీజేపీ తాజా సమావేశం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News