Tuesday, March 3, 2026
HomeతెలంగాణVictory | గెలుస్తా రేవంతన్నకు గిఫ్ట్ ఇస్తా..!

Victory | గెలుస్తా రేవంతన్నకు గిఫ్ట్ ఇస్తా..!

  • బీసీల రిజర్వేషన్ పై పోరు టైం లో ఉపఎన్నిక..
  • నవీన్ బీసీ బిడ్డ కావటంతో కాంగ్రెస్ కే ఛాన్స్..
  • సానుభూతి ఓట్లే ఆశగా బీఆర్ఎస్ ఎదురీత..
  • హిందుత్వ వాదం తో ముందుకు పోతున్న బీజేపీ..
  • నవీన్కే మద్దతంటున్న జూబ్లీహిల్స్ ఓటర్..

జూబ్లీహిల్స్ వీధుల్లో వినిపిస్తున్నది ఒకే ఒక్క మాట “నవీన్ యాదవ్ అంటే ధైర్యం, నమ్మకం, నిజాయితీ” నవీన్ యాదవ్.. ఇప్పుడు కేవలం ఒక అభ్యర్థి పేరు కాదు, ఒక నమ్మకం, ఒక సంకల్పం, ఒక స్వరం.. గెలుపు మాత్రమే అతని లక్ష్యం కాదు, అది ప్రజల గర్వంగా ఎదురు చూస్తున్న “కీలక ఘట్టం” కూడా…

“రౌడీ” అంటారా? అంటే విని నవ్వుతాడు. “నన్ను రౌడీ అంటున్నారు, కానీ నేను ప్రజల బిడ్డను” అని ధైర్యంగా చెబుతాడు. విమర్శల వర్షం కురిసినా, అతని సంకల్పం వీడడు.. పవనాలు మారినా, అతని దిశ మారదు.. జూబ్లీహిల్సే తన గమ్యం. ప్రజల నమ్మకమే ఆయన కవచం, ప్రేమే అతని శక్తి.ప్రతీ గల్లీ, ప్రతీ మైదానం అతని పేరు పలుకుతుంది. “పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే” అని చెప్పినప్పుడు, జూబ్లీహిల్స్ నేల గర్వంగా తలెత్తుతుంది. ఎదురు దెబ్బలకి వెనుదిరగడు, దుష్ప్రచారానికి తలొగ్గడు. అతని ధైర్యం కేవలం మాటల్లో కాదు.. ప్రతి చర్యలో ప్రతిధ్వనిస్తుంది. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈ బీసీ బిడ్డ, ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి సిద్ధమవుతున్నాడు.

- Advertisement -

ఇటీవలి తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర రాజకీయ వేడి ఈసారి జూబ్లీహిల్స్ వైపు మళ్లింది. ఉపఎన్నిక కేవలం ఒక సీటు కోసం పోటీ కాదు.. ఇది తెలంగాణలోని బీసీ వర్గం రాజకీయ ప్రభావం, మరో సారి కాంగ్రెస్ బాల నిరూపణ, ఇంకా ఇది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక లిట్మస్ టెస్ట్గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ మొత్తం ప్రచారం జరుగుతోంది.

నవీన్ యాదవ్ స్థానికుడిగా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదిం చుకున్నారు. “నేను రౌడీ కాను, ప్రజల బిడ్డను” అనే ఆయన మాటలు ఇప్పుడు జూబ్లీహిల్స్ వీధుల నుండి సోషల్ మీడియా వరకు వినిపిస్తున్నాయి . ఆయన మాట్లాడుతూ “పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే.. ప్రజలే నా బంధువులు, నా ఆత్మీయులు” అని చెప్పడం ప్రజలతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని మరోసారి నిరూపిస్తోంది. రాజకీయ వేదికలపై పెద్దగా అనుభవం లేకపోయినా, చిన్నతనం నుంచి తాను ప్రజలతో మమేకమయ్యే తీరు నవీన్ యాదవ్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

తండ్రి చిన్న శ్రీశైలం అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవకుడిగా ఎదిగిన నవీన్ యాదవ్, ఈ ఉపఎన్నికలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన జూబ్లీహిల్స్ లోని యూసుఫ్గూడ, మధాపూర్, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లో భారీ పాదయాత్రలు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడుతూ.. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటున్న తీరుకి, జనం బ్రహ్మరధం పడుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే, ముఖ్యమర్తి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొని “నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ ఆత్మవిశ్వాసానికి గుర్తు ” అని ప్రకటించారు. జూబ్లీహిల్స్లో బీసీ ఓటర్లే నిర్ణయాత్మక శక్తి కావడంతో, కాంగ్రెస్ వ్యూహం పూర్తిగా నవీన్ యాదవ్ చుట్టూ తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తున్న వేళ, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కాంగ్రెస్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు మళ్లీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమవంతుగా శ్రమిస్తున్నా, జూబ్లీహిల్స్లో పెద్దగా ప్రభావం చూపడంలో విఫలమవు తున్నారు. నవీన్ యాదవ్ పై “రౌడీ” వంటి ఆరోపణలు చేయడం ప్రజల్లో, నిజానికి బీఆర్ఎస్ పైనే ప్రతికూలతనే తెచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. “ఎంత దుష్ప్రచారం చేసినా నా ప్రజలకు నేనేంటో తెలుసు” అని నవీన్ యాదవ్ చెప్పడం ఆయనకు ఆత్మవిశ్వాసానికి, ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఉదాహరణ గా నిలుస్తోంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో “ముస్లిం హటావో హిందూ బచావో” వంటి నినాదాలు -పెట్టడం స్థానిక ముస్లిం ఓటర్లకు ససేమిరా నచ్చటం లేదు. జూబ్లీహిల్స్ ప్రాంతం మత, వర్గ సమైక్యతకు గత ఎంతో కాలంగా వేదికగా నిలిచింది. ప్రజలు అభివృద్ధి, స్థానిక నాయకుడు, నిజమైన సేవ అనే కేవలం మూడు అంశాలపైనే ఓటు వేయాలనుకుంటున్నారు.

ఇక తాజాగా జరుగుతున్న ప్రచారంలో, జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లలో నవీన్ యాదవ్ కు భారీ ప్రజా మద్దతు లభిస్తోంది. గత వారం జరిగిన ఓ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని “నవీన్ యాదవ్ దే జూబ్లీహిల్స్” అంటూ నినాదాలు చేశారు.
ఇక్కడ మరొక కీలక అంశం ఉంది . జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉపఎన్నికను లను కేవలం ఒక పార్టీ పోటీగా కాకుండా, స్థానిక అభివృద్ధికి ఓ అవకాశంగా చూస్తు న్నారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు వంటి స్థానిక ఇష్యూ ప్రస్తావిస్తూ నవీన్ యాదవ్ ప్రచారం – సాగిస్తున్నారు. “గెలిచి మొదట రోడ్లనే బాగుచేస్తా” అని ఆయన హామీ ఇవ్వడం కూడా ప్రజల్లో మంచి స్పందన తెచ్చింది.

ఇక తన ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన రోడ్ షో భారీ విజయాన్ని సాధించింది. అశేషప్రజానీకం, వేలాదిమంది ఓటర్లు హాజరై “కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది” అంటూ ముందే నినాదాలు చేశారు. ఇది కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహాన్ని మరింత పెంచింది అని నవీన్ యాదవ్ గెలుపు కేవలం జూబ్లీహిల్స్లో కాకుండా, హైదరాబాద్ నగర రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని పునరుద్ధరించేలా ఉంటుందని రాజకీయ పరిశీలకులు నొక్కి మరి చెబుతున్నారు.

మొత్తం మీద ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ అలుపెరుగని ప్రచారం ప్రజల లో చైతన్యాన్ని, నమ్మకాన్ని, ఆశను కలిగించింది. ఆయన సింపుల్ లాంగ్వేజ్, డైరెక్ట్ ఇంటరాక్షన్, స్థానికత ఆధారంగా తాను చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ కు ఎనలేని స్పందన తెస్తోందని చెప్పాలి. “జూబ్లీహిల్స్ సీటు ఈసారి నవీన్ యాదవ్ గెలుస్తాడు అని జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకంగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలు మహిళలు, జూబ్లీహిల్స్ ప్రజలందరి ఆశీర్వాదంతో తనకు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ఇదే ఉత్సాహం తో జూబ్లీహిల్స్ సీటును గెలిచి, రేవంతన్నకు గిఫ్ట్ గా ఇస్తానని ధీమా గా చెప్తూ నవీన్ యాదవ్ ఆత్మవిశ్వాసంతో ప్రచారంలో దూసుకుపోతున్నాడు.

కాగా, జూబ్లీహిల్స్లో న్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వాతావరణం మరింత వాడి వేడిగా మారుతోంది. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ వీధుల్లో వినిపిస్తున్న ప్రజల మాట మాత్రం ఒక్కటే.. “నవీనన్ననే గెలిపిద్దాం.. కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం”

- Advertisement -
RELATED ARTICLES

Latest News