Tuesday, March 3, 2026
Homeనల్లగొండసూర్యాపేట జిల్లా పోలీసుల రక్తదాన శిబిరం

సూర్యాపేట జిల్లా పోలీసుల రక్తదాన శిబిరం

  • మానవతా సేవకు నిదర్శనం
  • రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్

సూర్యాపేట : పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది, అధికారులు, పౌరులు కలిసి పాల్గొని మానవతా సేవకు ఆదర్శంగా నిలిచారు.జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా రక్తదానం చేసి పోలీసు సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం మానవతా సేవలో అత్యున్నతమైనది. మనం ఇచ్చే రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు. ప్రతి ఒక్కరూ రక్తదానంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.రక్తదాన శిబిరం సికిల్ సెల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రక్త బ్యాంక్‌కు అందజేసి తలసేమియా పిల్లల చికిత్సకు వినియోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, డీఎస్పీ ప్రసన్న కుమార్,పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్ఎస్ఐ లు కె. అశోక్, రాజశేఖర్, సురేష్, సాయిరాం, స్పెషల్ పార్టీ సిబ్బంది, అలాగే సూర్యాపేట పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News