ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు (Smart Phones) ఉంటున్నాయి. తల్లీతండ్రి (Parents) ఇద్దరూ పెద్ద పెద్ద మొబైల్ ఫోన్లు వాడుతుండటంతో పిల్లలు సైతం వాటి వాడకానికి అలవాటు పడుతున్నారు. కొంత మంది చిన్నారులు కాలక్షేపం (Time Pass) కోసం సెల్‌ఫోన్లు వినియోగిస్తుండగా మరికొంత మందికి ఇది వ్యసనం(Addiction)గా మారిపోయింది. అయితే.. ఫోన్ల వల్ల మంచీచెడు(Good and Bad) రెండూ ఉన్నాయని లేటెస్ట్ స్టడీ(Latest Study)లో తేలింది. నిత్యం డిజిటల్ పరికరాల(Digital Gadgets)ను ఉపయోగించే పిల్లల్లోని చాలా మందిలోనూ మానసిక (Mental) సమస్యలేవీ లేవని తేలింది.
అందువల్ల ఫోన్లు చూసే ప్రతిఒక్కరినీ ఒకే గాటన కట్టలేమని పరిశోధకులు (Researchers) పేర్కొంటున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, డెస్క్‌టాప్‌లు.. డిజిటల్ పరికరం ఏదైనా దానితో ఎంతసేపు గడిపారనే దానికన్నా వాటితో ఎలా గడిపారు అనేదే ముఖ్యమని చెబుతున్నారు. కాబట్టి.. పిల్లల చేతి నుంచి ఫోన్లను లాగేసుకోవటం, పరిమిత సమయం మాత్రమే ఫోన్ చూసేలా పరిమితులు (Restrictions) విధించటం మంచిదే కావొచ్చు గానీ అంత సమర్థించాల్సిన పద్ధతులేమీ కాదని అధ్యయనం వెల్లడిస్తోంది.
మరోవైపు.. 10 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలు గాడ్జెట్లకు అతుక్కుపోవటానికి, వారు వాటిని వాడుతున్న తీరుకు, వారిలో సూసైడ్ (Suicide) ఆలోచనలు రావటానికి సంబంధం ఉందని పరిశోధకులు వివరించారు. ఈ నేపథ్యంలో చిన్నారులు చదువు(Studies)ను పక్కనపెట్టి ఫోన్లు పట్టుకుంటున్నారా? లేక, ఫోన్లను హోం వర్క్‌లోని అనుమానాలను తీర్చుకోవటం కోసం వాడుతున్నారా అనేదీ పరిగణనలోకి తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
