Thursday, February 12, 2026
Homeఅంతర్జాతీయంTACA | వైభవంగా కెనడాలోని టోరోంటోలో దీపావళి పండుగ వేడుకలు

TACA | వైభవంగా కెనడాలోని టోరోంటోలో దీపావళి పండుగ వేడుకలు

తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Alliances of Canada (TACA) ఆధ్వర్యంలో 18th అక్టోబర్ 2025 శనివారం రోజున కెనడా దేశం టోరొంటో నగరం లోని టోరొంటో పెవిలియన్ ఆడిటోరియంలో 1600 పదహారు వందల మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు పాల్గొని ధీపావళి పండుగ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా దీపావళి వేడుకలలో పాల్గొన్నారు.

మొదటగా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి సభికులను ఆహ్వానించగా, అనిత సజ్జ సాంసృతిక కార్యదర్శి గారి సమన్వయముతో, ధనలక్ష్మి మునుకుంట్ల, వాణీ జయంతి, రాణి కొత్తపల్లి, శ్రీలేఖ ముద్దునూరు మరియు కవిత అలహరి గారల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమములు ప్రారంబించ బడినాయి.

- Advertisement -

సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంబమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిరాఘాటంగా రాత్రి పదకొండు ఘంటలవరకు దాదాపు మూడు వందలమంది స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో తాకా వేదికపై జరిగిన విశేషమైన సంబురం.ఈ వేడుకలలో తాకా 2025-27 కు గాను నూతన కమీటీ సభ్యులుగా ఎన్నికైన వారిని ఫౌండర్స్ చైర్మన్ అరుణ్ కుమార్ లయం ప్రమాణాస్వీకారం చేయించారు.

2025-27 నూతన కమిటీ: ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి – అధ్యక్షులు, హనుమంతాచారి సామంతపుడి – ఫౌండర్స్ కమిటీ చైర్మన్, కల్పన మోటూరి – బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్, రమేశ్ మునుకుంట్ల – ఫౌండర్ మరియు ఎక్స్ అఫిసియో మెంబర్, వాణీ జయంతి – ఉపాధ్యక్షులు, మల్లిఖార్జునాచారి పదిర – జెనరల్ సెక్రెటరి, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు – ట్రెజరర్, లిఖిత యార్లగడ్డ – సాంస్కృతిక కార్యదర్శి, కళ్యాణ్ వల్లాల – డైరక్టర్, ప్రశాంతి పిన్నమరాజు – డైరక్టర్, యస్వంత్ రెడ్డి కర్రి – డైరక్టర్, అశ్విత అన్నపురెడ్డి – డైరక్టర్, రాజా అనుమకొండ – డైరక్టర్, అనిత సజ్జ – బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు, పవన్ బాసని – బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు, ప్రవీణ్ పెనుబాక – బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు, ఆదిత్య వర్మ – బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News