Tuesday, March 3, 2026
HomeతెలంగాణBC reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు

BC reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక కీలకమైన జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, స్థానిక సంస్థలలోని సీట్లలో, పదవులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు(BC reservations) కల్పిస్తారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడు ఈ ఆదేశాలు మార్గం సుగమం చేశాయి. ఈ ఎన్నికలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించడానికి సెప్టెంబర్ 30ని గడువుగా హైకోర్టు ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత,ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయితీలు, 1,12,534 వార్డులకు ఎన్నికలు జరగాలి. అలాగే 565 జెడ్పిటీసీలు, 5,763 ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాతా 565 మండల పరిషత్ లు , 31 జిల్లా పరిషత్ ల ఛైర్మన్ల ఎన్నికలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News