ఓ రాజకీయనాయకుల్లారా ఓట్ల పండుగొస్తేనే
మా ఇండ్లజాడలు గుర్తొస్తయి కదా..
మా ఇంటి గాడుపాడులో కూసోనే మూల్గుతున్న
ముసలవ్వనైన ముద్దాడిపోతిరి కదా
వగలమారి ప్రేమనొలకబోసి..
గెలిచినక్క ఎన్నిసార్లు మీ కొంపలకు వచ్చిపోయామో
ఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితివారా…
ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలు
గెలిచినక్క కూడా ఉండాలే.
నాయకుడికీ ఒక్కటేకాదురా నక్కజిత్తులు
మా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారు
ఇకనైనా తెలుసుకోరా జెరబుర్రబెట్టి.
- కనకమామిడి సన్నీ