Thursday, February 12, 2026
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌లోని ఇండియన్లు సేఫ్‌

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లు సేఫ్‌

భారత రాయబార కార్యాలయం ప్రకటన

ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌లందరూ సేఫ్‌గా ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం జరుగుతుండటంతో అక్కడున్న మన ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో టెల్‌అవీవ్‌లోని ఇండియన్‌ ఎంబసీ స్పందించింది.

- Advertisement -

భారత పౌరుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని, వారికి కావాల్సిన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయటంతోపాటు అన్ని చర్యలు చేపట్టామని తెలిపింది. కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు ఇలా అన్ని వర్గాలవారితో టచ్‌లో ఉన్నామని పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, అనవసర ప్రయాణాలు చేయొద్దని మన పౌరులకు సూచించామని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News