Friday, March 27, 2026
Homeజాతీయంసీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ కుమార్‌

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ కుమార్‌

భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేష్‌ కుమార్‌(Gyanesh Kumar) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న ఆయన సోమవారం నాడు సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్‌ కుమార్‌ స్థానంలో జ్ఞానేష్‌ కుమార్‌ పోల్‌ ప్యానెల్‌ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అర్ధరాత్రి సమయంలో సీఈసీ పేరు ప్రకటించడమేంటి? అని నిలదీసింది. ఇక ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బుధవారం విచారణకు రానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News