Homeనిజామాబాద్‌Job Mela | ఎల్లారెడ్డి జాబ్ మేళాకు విశేష స్పందన…

Job Mela | ఎల్లారెడ్డి జాబ్ మేళాకు విశేష స్పందన…

  • భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు..
  • 7000 పైగా నిరుద్యోగ యువతి,యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. సుమారు 7000 పైగా అభ్యర్థులు ఈ జాబ్ మీలో పాల్గొని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ జాబ్ మేళాను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సందర్శించి నిరుద్యోగ అభ్యర్థులతో మాట్లాడి యువతీ యువకులకు భరోసా కల్పించారు.

ఈ జాబ్ మేళాలో కీయ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఎయిర్టెల్,టాటా, స్కైఅప్ సొల్యూషన్స్, బిగ్ సి, లాంటి ప్రముఖ కంపెనీలతోపాటు 74 కంపెనీలు ఈ జాబ్ నెలలో పాల్గొన్నాయి. మేళాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశారు . తాడ్వాయి మండలం నుండి ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి నిరుద్యోగ యువతీ, యువకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ జాబ్ మేళా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News