Homeనల్లగొండElection Code | ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి.

Election Code | ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేయాలి.

  • యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ, నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం రోజున ఆలేరు మున్సిపల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, నామినేషన్ ఫారంలు, రిజిస్టర్లను పరిశీలించారు.

నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ముద్రణ చేస్తామని వెల్లడించారు. 11వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

- Advertisement -
Election Code Inspection at Alair Municipality by District Collector

యాదాద్రి జిల్లాలోని ఆలేరు యాదగిరిగుట్ట భువనగిరి పోచంపల్లి, మోత్కుర్, చౌటుప్పల్,మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, అబ్జర్వర్,శ్రీనివాస్, ఎ ఆర్వో వెంకటేష్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News