Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Jayanti | ఓయూ ఆర్ట్స్ కళాశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

Jayanti | ఓయూ ఆర్ట్స్ కళాశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

  • సావిత్రిబాయి పూలే జయంతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని-సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ప్రొఫెసర్లు, ఉద్యోగులు,రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆర్ట్స్ కళాశాల వుమెన్ ఎంపవర్మెంట్ సెల్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ మాయాదేవి మాట్లాడుతూ దోపిడీ,పీడన,అణచివేత ఉన్న ఆనాటి సమాజంలో పోరాడి అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు విద్యనందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు.సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని తెలిపారు. పూలే రాసిన “గులాంగిరి” పుస్తక అంశాలను సిలబస్ లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ( హాస్టల్స్ ) డాక్టర్ బాలు నాయక్,విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కో చైర్ పర్సన్ డాక్టర్ సి ఎస్ స్వాతి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి .స్వాతి, ఓయూ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ,ప్రొఫెసర్ రాములు, ఓయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ చల్లమల్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఇందిర,ప్రొఫెసర్ కృష్ణ కుమార్,డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్, డాక్టర్ నమ్రత,డిఆర్ శాంసన్,ఏ ఆర్ పి శ్రీనాథ్,పి. లింగారెడ్డి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News