రోజంతా అలసటతో రాత్రి దంతాలను బ్రష్ చేయడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. కానీ నిజానికి రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రష్ చేయడం వల్ల దంత ఆరోగ్యానికి, మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సమస్యలు వచ్యే అవకాశాలు ఉంటాయి. ఉదయం బ్రష్ చేయడం వల్ల నోరు తాజాగా ఉండి రోజంతా శుభ్రంగా ఉంటుంది. అయితే రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం దంతాలను మరింత రక్షిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. రాత్రి సమయంలో లాలాజలం (saliva) ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడే సహజ రక్షణ వ్యవస్థ. నిద్రపోతున్నప్పుడు నోరు చాలా సేపు నిశ్చలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆహార అవశేషాలు లేదా బ్యాక్టీరియా మిగిలి ఉంటే అవి దంతాలకు నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. అందుకే డెంటిస్టులు రాత్రి బ్రషింగ్ చాలా ముఖ్యమని చెబుతున్నారు.
Dental Care | పొద్దున్నే కాదు.. రాత్రి కూడా బ్రష్ చేయాల్సిందే!
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
