Saturday, May 9, 2026
Homeస్పోర్ట్స్Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ కు షోకాజ్ నోటీసు..

Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ కు షోకాజ్ నోటీసు..

  • నోటీసు జారీ చేసిన రెజ్లింగ్ సమాఖ్య..
  • యాంటీ డోపింగ్ రూల్స్ ను అతిక్రమించినట్లు ఆరోపణలు..

రెజ్ల‌ర్ వినేశ్ పోగ‌ట్‌ కు భార‌తీయ రెజ్లింగ్ స‌మాఖ్య షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణార‌హిత్యానికి పాల్ప‌డింద‌ని, యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్ర‌మించిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు వినేశ్ ఎటువంటి టోర్నీల్లో పాల్గొన‌డానికి అర్హురాలు కాద‌ని రెజ్లింగ్ స‌మాఖ్య పేర్కొన్న‌ది. డ‌బ్ల్యూఎఫ్ఐ 15 పేజీల నోటీసును జారీ చేసింది. వినేశ్ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల దేశానికి చెడ్డ పేరు వ‌చ్చిన‌ట్లు ఆ నోటీసులో తెలిపారు. భార‌తీయ రెజ్లింగ్ వ్య‌వ‌స్థ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింద‌ని, డ‌బ్ల్యూఎఫ్ఐ నిబంధ‌న‌ల‌ను ఆమె ఉల్లంఘించిన‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News