Wednesday, March 4, 2026
Homeమేడ్చెల్‌Eetala | ఎంపీ ఈటలను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

Eetala | ఎంపీ ఈటలను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్ భగాయత్ ఎస్టీపీని మార్చాలని వినతి

మల్కాజ్‌గిరి ఎంపీ (Malkajgiri MP) ఈటల రాజేందర్‌(Etala Rajender)ను ఉప్పల్ ఎమ్మెల్యే (Uppal Mla) బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxma Reddy) బుధవారం కలిశారు. ఉప్పల్ భాగాయత్‌(Bhagayath)లోని హనుమాన్ ఆలయం వెనక నిర్మాణానికి మంజూరైన STP స్థానాన్ని మార్చాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. HMWS & SB మంజూరు చేసిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) నిర్మాణంపై నాలుగు కాలనీల(కూర్మా నగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీ నరసింహ నగర్, సమదాన్ సొసైటీ) ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ 4 కాలనీలకు ఈ ప్రదేశం దగ్గరగా ఉంది. ఇక్కడ 1997 నుంచి దాదాపు 2 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. STP వల్ల దుర్వాసన వస్తుందని, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, గాలి, పర్యావరణ కాలుష్యం సంభవిస్తుందని, నివాసితుల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత STP స్థానాన్ని పునఃపరిశీలించి నివాసితుల అసౌకర్యాన్ని నివారించాలని కోరారు. ప్రత్యామ్నాయ నాన్-రెసిడెన్షియల్ ప్రాంతానికి మార్చాలని సూచించారు. దీనిపై ఈటల స్పందిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డ్ (HMWS & SB) మేనేజింగ్ డైరెక్టర్‌‌తో మాట్లాడతానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News