Homeరంగారెడ్డిJawahar Nagar | పూజకు నోచుకోని పెద్దమ్మ తల్లి ఆలయం

Jawahar Nagar | పూజకు నోచుకోని పెద్దమ్మ తల్లి ఆలయం

  • పెద్దమ్మతల్లి ఆలయం శిథిలావస్థకు గురవుతుందని స్థానికుల వేదన

వ్యవస్తాపకులు కారింగుల నర్సింగరావు గౌడ్ చంద్రపురి కాలనీలో పెద్దమ్మ గుడి కోసం మూడు వందల ఇరవై గజాల స్థలాన్ని కేటాయించి ఆలయ నిర్మాణం పనులు చేపట్టి ఇరవై ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పెద్దమ్మ గుడి పూజకు నోచుకోని దౌర్భాగ్య స్థితి నెలకొనడం ఎంతో బాధాకరమని స్థానికులు విన్నవిస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం గతంలో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఎన్నికల సమయంలో బోర్ వేయించి రెండు లక్షల నగదును అందజేయడం జరిగిందని అలాగే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి మెంబర్ అఫ్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికల సందర్భంగా రెండు లక్షల నగదును అందజేయడం జరిగిందని మొదటిసారి,

మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు గా ఎన్నికల బరిలో నిలిచిన చామకూర మల్లారెడ్డి మూడు లక్షల నగదును అమ్మవారి ఆలయం కోసం అందజేయడం జరిగిందని మళ్లీ గత ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎన్నికల సమయంలో మూడు లక్షల నగదును అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం అందజేయడం జరిగిందని అయినప్పటికీ స్థానికులుగా ఉన్న పెద్దలు పెద్దమ్మ దేవాలయ నిర్మాణం పనులు పూర్తి చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గావించి స్థానికులతో పాటు జవహార్ నగర్ ప్రజలందరికీ అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని సమకూర్చాలనే స్ఫూర్తి స్థానికుల్లో ఏమాత్రం లేకపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Peddamma Talli Temple Construction Delay Jawahar Nagar.jpg1

కొన్ని కాలనీల్లో అరవై గజాల విస్తీర్ణం కలిగి ఉన్న స్థలాల్లో నిర్మించిన దేవస్థానాలలో దేవత మూర్తులు పూజలు అందుకుంటుంటే మూడు వందల ఇరవై గజాల విస్తీర్ణం కలిగిన ఉన్న పెద్దమ్మతల్లి దేవస్థాన ప్రాంగణం ఇరవై ఆరు సంవత్సరాల నుండి పూజకు పనికిరాని పుష్పం మాదిరిగా విగ్రహ ప్రతిష్టకు నోచుకోక దేవాలయం శిథిలావస్థకు చేరువవడం ఎంతో చింతించదగ్గ విషయమని స్థానికులు మనసులో మాటలను వెలబుచ్చుతున్నారు.

ఇప్పటికైనా పెద్దమ్మతల్లి దీవెనలతో పెద్ద మనుషులుగా చెలమానవుతున్న పెద్దలు తక్షణమే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గావించి ఆలయ అభివృద్ధికి కృషిచేసి అమ్మవారి దివ్యదర్శన భాగ్యం స్థానికులతో పాటు జవహర్ నగర్ ప్రజలందరికీ కలిగించేలా శ్రద్ధతో ముందుకు సాగాలని స్థానికులు విన్నవిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News