Homeరంగారెడ్డిFIR | అనధికార నిర్మాణం అడ్డుకోవడంలో ఉద్రిక్తత

FIR | అనధికార నిర్మాణం అడ్డుకోవడంలో ఉద్రిక్తత

  • అధికారిపై దాడి ఆరోపణతో ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు

కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ గ్రామంలో ప్రభుత్వ భూమిపై అనధికార నిర్మాణం చేపట్టిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఫిర్యాదుదారు జె. రమేష్, గిర్దావర్, కాప్రా తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 17న ఉదయం సుమారు 11 గంటల సమయంలో మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 324లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

FIR Registered Over Unauthorized Construction in Jawahar Nagar1

ఈ సందర్భంగా ప్రగతినగర్ కాలనీలో హబీబా అనధికారంగా ఒక గది నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ నిర్మాణాన్ని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే హబీబా, ఆమె కుమారుడు షరీఫ్ పనిని అడ్డుకున్నట్లు సమాచారం.

- Advertisement -

ఈ క్రమంలో షరీఫ్ ఫిర్యాదుదారుపై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ప్రభుత్వ భూములపై ఎలాంటి అనధికార నిర్మాణాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News